బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు..! 8 d ago
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు తరలి వెళ్తున్నారు. ముందుగా పుష్పా ప్రొడ్యూసర్స్, దర్శకుడు సుకుమార్ ఆయన నివాసానికి వెళ్లారు. ఇక తాజాగా బన్నీ నివాసానికి విజయ్ దేవరకొండతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లారు. అల్లు అర్జున్ హత్తుకొని కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. కాసేపటిలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడతారని సమాచారం.